Baidu ERNIE AI: AI పోటీలో దూసుకుపోతున్న చైనా... సరికొత్త AI మోడళ్లు.! 12 d ago

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తీవ్ర పోటీ నడుస్తుంది. అనేక కంపెనీలు కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవలే చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ డీప్‌సీక్ (Deepseek)ను తీసుకొచ్చి.. ఈ రంగంలో ఒక అద్భుతాన్నే నెలకొల్పింది. తక్కువ ఖర్చుతో లేటెస్ట్ AI మోడళ్లను అభివృద్ధి చేసి టెక్ మార్కెట్‌ని కుదిపేసింది. అయితే తాజాగా చైనా సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన బైదూ (Baidu) రెండు కొత్త AI మోడళ్లను లాంచ్ చేసింది.
ERNIE 4.5… X1 అనే రెండు కొత్త రీజనింగ్ ఫోకస్డ్ మోడళ్లను ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ మార్చ్ 16న ప్రకటించింది. ERNIE 4.5 అనేది రెండేళ్ల క్రితం విడుదలైన బైదూ పాత మోడల్ యొక్క కొత్త వెర్షన్. ERNIE 4.5 మోడల్ మల్టీమోడల్ సామర్థ్యంతో వచ్చిందని బైదూ తెలిపింది. ERNIE X1 ను కొత్తగా రూపొందించారు. X1 మోడల్ డీప్‌సీక్ AI ఫీచర్లను... దానికన్నా తక్కువ ధరకే అందిస్తుందని బైదూ తెలిపింది. ఒకసారి ఈ AI మోడళ్ల గురించి తెలుసుకుందాం రండి!
ERNIE 4.5:
- ఇది అద్భుతమైన మల్టీమోడల్ సామర్థ్యాలను కలిగి ఉంది.
- అధునాతన భాషా నైపుణ్యాలు, విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం, మెరుగైన మెమరీని కలిగి ఉంది.
- టెక్స్ట్, వీడియో, ఇమేజ్‌లు, ఆడియో వంటి వివిధ రకాల డేటాను ప్రాసెస్ చేయగలదు.
- GPT-4o కంటే కొన్ని రంగాల్లో ముఖ్యంగా డాక్యుమెంట్లు, మ్యాథమెటిక్స్, చైనీస్ భాషలో మంచి ఫలితాలు సాధించింది.
ERNIE X1:
- క్యాలిక్యులేషన్స్, కోడింగ్ వంటి క్లిష్టమైన పనులను చేయడానికి ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది.
- ఇది స్వయంగా ఆలోచించే ఫస్ట్ డీప్ థింకింగ్ మోడళ్లలో ఒకటి.
- ఇతర మోడల్‌లతో పోలిస్తే ఇది తక్కువ ధరకే వస్తుంది.
- వ్యాపారానికి ఉపయోగకరమైన కోడింగ్ మరియు ఆలోచనా పనుల కోసం రూపొందించబడింది.
Google, OpenAI, Mistral వంటి కంపెనీలు తమ AI మోడళ్లను విడుదల చేయడానికి ముందు చాలా సమయం తీసుకుంటాయి. ఎందుకంటే ఆ మోడల్ కి కావాల్సిన.. భద్రత, ఫంక్షనాలిటీ, పెర్ఫార్మన్స్ ను పలుమార్లు చాలా జాగ్రత్తగా పరీక్షించిన తరువాతే విడుదల చేస్తాయి. అయితే చైనీస్ AI కంపెనీలు మాత్రం తమ మోడళ్లను మార్కెట్లోకి తొందరగా ప్రవేశపెడతాయి. అవి అంతగా బాగా లేకపోయినా.. మార్కెట్ లో వాటి వినియోగం మొదలైపోతుంది. ManusAI, DeepSeek లాగానే, బైదూ కూడా తన ERNIE మోడళ్లను తొందరగా విడుదల చేసింది. ఈ మోడళ్ల ధరను తగ్గించి.. మార్కెట్ లో AI పోటీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.
బైదూ ERNIE మోడల్ GPT-4o, DeepSeek V3 లాంటి పెద్ద AI మోడళ్లకు పోటీ ఇస్తుంది. ERNIE X1 మోడల్ చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది… ఇది DeepSeek-R1 అనే మరో మోడల్ లాగే పనిచేస్తుంది అదికూడా సగం ధరకే. కానీ ఈ ERNIE AI మోడళ్లు మిగతా AI లాగే పనిచేస్తాయో.. లేదో అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ AI లు వాడుకకు పనికొస్తాయో లేదో చూడాలి.!
ఇది చదవండి: టెక్ ప్రపంచంలో సంచలనం..! రీడిజైనింగ్ కు సిద్ధమైన యాపిల్ సాఫ్ట్వేర్.!